తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓట‌రు లిస్టులో ఐరన్ సత్యనారాయణ, డోంట్ చేంజ్ బాపు - manthini voter list news

రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఓటర్ల జాబితాను విడుదల చేశారు. అయితే ఏంటని అనుకుంటున్నారా.. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్​.. ఆ ఓటరు జాబితాలో హాస్యాస్పదంగా పేర్లు బయటపడటంతో ఓటర్లు అవాక్కవుతున్నారు. మరణించిన వారి పేర్లు సైతం జాబితాలో ఉన్నాయి. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలో చోటుచేసుకుంది.

Iron Satyanarayana, Dont change Bapu in voter list at manthini
ఓట‌రు లిస్టులో ఐరన్ సత్యనారాయణ, డోంట్ చేంజ్ బాపు

By

Published : Jan 4, 2020, 12:57 PM IST

పురపాలక ఎన్నికల కోసం ప్రచురించిన ఓటర్ల జాబితాలో చిత్రవిచిత్రాలు కనిపిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా మంథనిలో ఓటర్ల పేర్లను తెలుగులోంచి ఆంగ్లంలోకి అనువదించారు. ఇనుముల సత్యనారాయణ అనే వ్యక్తి పేరును... ఆంగ్లంలో ఐరన్ సత్యనారాయణ అని ముద్రించారు. మారుపాక బాపు పేరును ఆంగ్లంలో డోంట్ చేంజ్ బాపు, మారుపాక యశోద పేరును ట్రాన్స్‌ఫార్మ్‌ యశోద, గుమ్మడి అనురాధ పేరును పంప్కిన్ అనురాధ అని ముద్రించారు.

కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోనూ ఇలాంటి విచిత్రాలే అవాక్కయ్యేలా చేస్తున్నాయి. మూడేళ్ల చిన్నారికి ఓటు హక్కు కల్పించారు. వయస్సను 35ఏళ్లుగా ముద్రించారు. ఇదేంటని మున్సిపల్‌ అధికారుల్ని నిలదీస్తే … రెవెన్యూ అధికారుల్ని అడగాలని తప్పించుకుంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ఓట‌రు లిస్టులో ఐరన్ సత్యనారాయణ, డోంట్ చేంజ్ బాపు

ఇదీ చూడండి : మూడేళ్ల చిన్నారికి ఓటు హక్కు.. వయసు 35 ఏళ్లు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details