పెద్దపల్లిజిల్లాకేంద్రంలోని ప్రభుత్వఆసుపత్రిలో సూదిమందు వికటించి నాలుగురోజుల పసికందు మృతిచెందింది. సిబ్బంది నిర్లక్ష్యం వలనే తమ బిడ్డ చనిపోయిందని బంధువులు ఆందోళనకుదిగారు.
సూదిమందు వికటించి శిశువుమృతి
By
Published : Feb 4, 2019, 6:44 AM IST
సూదిమందు వికటించి శిశువు మృతి
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో సూది మందు వికటించి శిశువు మృతిచెందడంతో బంధువులు ఆందోళనకు దిగారు. ధర్మారం మండలం కుర్మపల్లికి చెందిన ఆకుల సంధ్య నాలుగు రోజుల కిందట బిడ్డకు జన్మనిచ్చింది. ఆదివారం శిశువుకు సూదిమందు వేయించిన కొంత సమయానికే మృతి చెందింది. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ దూరమైందని వారిపై చర్యలు తీసుకోవాలని బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు.