పెద్దపల్లి జిల్లా కేంద్రంలో.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. పట్టణంలోని పెట్రోల్ బంకు ముందు ఆందోళన వ్యక్తం చేస్తూ.. ధరలను వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
పెట్రోల్, డీజిల్ ధరలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతల నిరసన - నేటి పెట్రోల్, డీజిల్ ధరలు
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. పట్టణంలోని పెట్రోల్ బంకు ముందు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ.. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేశారు.

protest against petrol prices
కరోనా కారణంగా ఉపాధి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు కేంద్రం ఇంధన ధరలను పెంచుతూ సామాన్యులపై మరింత భారం మోపుతోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు