నైరుతి రుతుపవనాల ప్రారంభంతో వాతావరణం చల్లబడి ఖరీఫ్ ఆరంభిస్తారు. అదేవిధంగా మృగశిర కార్తెలో చేపలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు రావని ప్రజల నమ్మకం. పెద్దపల్లి జిల్లా మంథనిలో చెరువుల వద్ద చేపల కోసం వేకువ జామునుంచే నగర వాసులు క్యూ కట్టారు. బయట మార్కెట్లో కిలో రూ. 150 నుంచి 200కు విక్రయిస్తున్నారు. చెరువుల వద్ద రూ. 100కే లభిస్తున్నందున పెద్ద ఎత్తున వచ్చి కొనుక్కుని వెళ్లారు.
మృగశిర ఆగమనం... చేపలకోసం జనం పయనం - తెలంగాణ తాజా వార్తలు
మృగశిర కార్తె ఆగమనంతో చెరువుల వద్ద సందడి నెలకొంది. వేకువ జాము నుంచే పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలు చేపలు కొనుక్కుని వెళ్లారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని పెద్ద చెరువుల వద్ద భారీ సంఖ్యలో చేపలు విక్రయించారు.
పెద్దపల్లి జిల్లా మంథని
కొందరైతే చెరువులోంచి బయటకు తీయకుండానే బేరాలాడేశారు. పెద్ద సంఖ్యలు కొనుగోలుదారులు రావడం వల్ల చెరువు గట్లు కిక్కిరిసి పోయాయి. చేపల వ్యాపారులు కూడా ఈ ఏడాది విక్రయాలు బాగున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:Mrigashira karte: రద్దీగా చేపల మార్కెట్లు.. నిబంధనలు బేఖాతారు