మద్యం కోసం జనాలు బారులు తీరారు. లాక్ డౌన్ ప్రకటనతో భారీగా దుకాణాల ముందు క్యూ కట్టారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో మందుబాబులు అవసరానికి మించి కొనుగోలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున అందరూ ఒక్కసారిగా తరలిరావడంతో రద్దీ పెరిగింది.
మద్యం కోసం దుకాణాల ముందు బారులు - పెద్దపల్లి జిల్లా వార్తలు
లాక్ డౌన్ ప్రకటన మందుబాబులను పరుగులు పెట్టిస్తోంది. ఎక్కడ చూసినా పెద్దఎత్తున వైన్‌షాపుల ముందు గుమిగూడారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో మద్యం ప్రియులు తరలిరావడంతో దుకాణాలు కిక్కిరిసిపోయాయి.
మంథనిలో మందుబాబులు బారులు
కొన్నిచోట్ల నో స్టాక్
కొన్నిచోట్ల ఇప్పటికీ నో స్టాక్ అని బోర్డులు పెడుతున్నారు. దుకాణాలను మూసి వేస్తున్నారు. ఇదే అదునుగా మద్యం బ్లాక్ చేస్తున్నారని కొనుగోలుదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించకుండా ప్రజలు మందు కోసం ఎగబడుతున్నారు.