మత్స్యకారులు.. తమ వృత్తితో పాటు, పుష్కరాలు, ఇతర ఉత్సవాలల్లో భక్తుల కోసం చేసే సేవలు ఎంతో గొప్పవని అఖిల భారత గంగపుత్ర మహాసభ నేషనల్ ప్రెసిడెంట్ సత్యం బెస్త కొనియాడారు. ఇటీవల మహాశివరాత్రి రోజున పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ మహిళను కాపాడిన రెస్క్యూ టీమ్ సభ్యులను రామగుండం కార్పొరేషన్ గంగపుత్ర సంఘం సన్మానించింది.
'పుష్కరాలల్లో.. గంగపుత్రుల సేవలు ఎనలేనివి'
గోదావరి పుష్కరాల్లో.. గంగపుత్రులు తరతరాలుగా తమ సేవలు అందిస్తున్నారని రామగుండం కార్పొరేషన్ గంగపుత్ర సంఘం ప్రధాన కార్యదర్శి సుభాశ్ బెస్త పేర్కొన్నారు. మహాశివరాత్రి రోజున పెద్దపల్లి జిల్లా గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ మహిళను కాపాడిన రెస్క్యూ టీమ్ సభ్యులను సంఘం ప్రెసిడెంట్ సాంబమూర్తి బెస్తతో కలిసి ఆయన సన్మానించారు.
'పుష్కరాలల్లో.. గంగపుత్రుల సేవలు ఎనలేనివి'
గోదావరి నది పుష్కరాల్లో.. గంగపుత్రులు తరతరాలుగా తమ సేవలు అందిస్తున్నారని కార్పొరేషన్ గంగపుత్ర సంఘం ప్రధాన కార్యదర్శి సుభాశ్ బెస్త పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు రాజయ్య బెస్త, మంగమ్మ బెస్త, సదానందం బెస్త తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:నివురుగప్పిన నిప్పులా కరోనా.. జాగ్రత్త పడకపోతే ముప్పేగా!
Last Updated : Mar 19, 2021, 7:44 AM IST