పెద్దపల్లి జిల్లా మంథని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టెస్టుల కోసం వచ్చిన ప్రజలు ఎండ వేడి తట్టుకోలేక చెప్పులను వరుసలో ఉంచి నీడలో సేద తీరుతున్నారు. మండలంలోని ప్రజలు ఉదయం ఆరు గంటలకే చేరుకుంటున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఓపీ, పరీక్షలు ప్రారంభిస్తున్నారు.
భానుడి భగభగ.. కరోనా పరీక్షల కోసం వరుసలో చెప్పులు! - తెలంగాణ వార్తలు
ఓవైపు కరోనా మహమ్మారి... మరోవైపు భానుడి భగభగ ప్రజలను సతమతం చేస్తున్నాయి. ఏమాత్రం లక్షణాలు ఉన్న పరీక్ష కేంద్రాలకు వెళ్తున్నారు ప్రజలు. పరీక్షా కేంద్రాల్లో ఎండ తిప్పలు తప్పడం లేదు. వేడిని భరించలేక వరుసలో చెప్పులు ఉంచాల్సిన పరిస్థితులు మంథని సామాజిక ఆరోగ్యం కేంద్రంలో చోటు చేసుకున్నాయి.
కరోనా పరీక్షా కేంద్రం వద్ద రద్దీ, మంథని పరీక్షా కేంద్రం వద్ద జనం బారులు
రోజూ 35 నుంచి 40 కరోనా నిర్ధరణ కిట్లు మాత్రమే కేటాయిస్తున్నారని వైద్యులు తెలిపారు. పరీక్షలు అవసరం లేకున్నా కొందరు వస్తున్నారని పేర్కొన్నారు. రోజూ సుమారు 80 నుంచి 100 మంది వరకు నిర్ధరణ పరీక్షల కోసం వైద్యశాలకు వస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఎండలో నిలబడలేక అలసిపోయి సేద తీరారు.