తెలంగాణ

telangana

ETV Bharat / state

మంథనిలో భారీ వర్షం.. నీట మునిగిన పంటపొలాలు - మంథని

భారీ వర్షాలు కురవడం వల్ల పెద్దపల్లి జిల్లా మంథనిలో పంటలు నీట మునిగాయి. పలుచోట్ల వాగులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి.

నీట మునిగిన పంటపొలాలు

By

Published : Aug 7, 2019, 12:23 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్​లో మంగళవారం నుంచి కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగిపోయాయి. నియోజకవర్గంలోని కమాన్​పూర్, ముత్తారం, మంథని, రామగిరి మండలాల్లో రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. పలుచోట్ల వాగులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. వానల రాకతో నాట్లకు సిద్ధమవుతున్న దశలో భారీ వర్షాలు రైతులకు నష్టాన్ని మిగిల్చాయి. కొన్ని వంతెనలు కుంగిపోయి ప్రమాద స్థితిలో చేరుకున్నాయి. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నీట మునిగిన పంటపొలాలు

ABOUT THE AUTHOR

...view details