తెలంగాణ

telangana

ETV Bharat / state

మంచుతో సుందరంగా కనువిందు చేస్తున్న మంథని - Heavy Fog at Manthani in Peddapalli district

ఓ వైపు చలి... మరో వైపు ఎటు చూసినా పొగమంచుతో పెద్దపల్లి జిల్లా మంథని​ వాసులు ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించారు. ఉదయం 9 గంటల వరకు సూర్యున్ని దాచేసిన మంచు... స్థానికులకు కన్నుల విందైన దృశ్యాల్ని చూపించింది.

Heavy Fog at Manthani in Peddapalli district
మంచు సుందరంగా... మంథని నగరం

By

Published : Dec 19, 2019, 6:35 PM IST

పెద్దపల్లి జిల్లా మంథనిని మంచు దుప్పటి కప్పుకుంది. వేకువజాము నుంచి విపరీతంగా మంచు కురుస్తూ... ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. పక్షుల కిలకిలారావాలు, ఎప్పుడు ఎప్పుడు మంచు తొలగిపోతుందా అని మేఘాల చాటు నుంచి సూర్యుడు తొంగి చూస్తున్న దృశ్యాలు మంథని ప్రజలను ఆకట్టుకున్నాయి. ప్రధాన రహదారిపై వాహనాదారులు లైట్లు వేసుకొని జాగ్రత్తగా వెళ్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరిగింది.

మంచు సుందరంగా... మంథని నగరం

ABOUT THE AUTHOR

...view details