తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏసీబీకి చిక్కిన హెడ్​మాస్టర్.. - head master

హాల్​ టికెట్​ ఇవ్వడానికి  విద్యార్థి నుంచి 1500 రూపాయలు తీసుకుందో ప్రధానోపాధ్యాయురాలు.   టీసీ కోసం వెళ్తే రెండువేలు డిమాండ్ చేసింది. పాపం పండి ఏసీబీ కి అడ్డంగా దొరికింది.

లలిత

By

Published : Aug 1, 2019, 10:21 PM IST

ఏసీబీకి చిక్కిన హెడ్​మాస్టర్..

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట్​లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లలిత లంచం తీసుకుంటుూ ఏసీబీకి చిక్కింది. గత సంవత్సరం 10వ తరగతి చదువుకున్న సుద్దాల రఘు ఫెయిలయ్యాడు. సప్లమెంటరీ పరీక్షకు హాల్ టికెట్ ఇచ్చేందుకు మొదట హెడ్​మాస్టర్ నిరాకరించింది. హాల్ టికెట్ ఇవ్వాలంటే మూడు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. తండ్రికి తెలియకుండా రఘు తన తల్లి వద్ద రూ.1500 తీసుకొచ్చి ప్రధానోపాధ్యాయురాలికి ఇచ్చి హాల్​ టికెట్​ తీసుకున్నాడు.

టీసీ కోసం రూ. 2వేలు అడిగింది..

సప్లిమెంటరీ పరీక్షలో పాసైన రఘు టీసీ కోసం పాఠశాలకు వెళ్లాడు. ట్రాన్స్​ఫర్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే మళ్లీ 2వేలు ఇవ్వాలని ప్రధానోపాధ్యాయురాలు లలిత డిమాండ్​ చేసింది. రెండు నెలలుగా టీసీ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది. చేసేదేమిలేక రఘు తండ్రి కరీంనగర్​లోని ఏసీబీ అధికారులను సంప్రదించారు. పక్కా ప్లాన్ ప్రకారం పాఠశాలలో హెడ్​మాస్టర్​కు 2వేల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితురాలిని శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు.

ఇదీ చూడండి: తెలంగాణ గవర్నర్​ను కలిసిన సీఎం జగన్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details