తెలంగాణ

telangana

ETV Bharat / state

'హరితహారానికి బాసటగా గ్రీన్​ ఛాలెంజ్'​ - latest news of green challenge

గ్రీన్ ఛాలెంజ్ పర్యావరణానికి మేలు చేసే మహోన్నత కార్యక్రమం అని ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెుక్కలు నాటిన ఆయన.. మరో ఐదుగురు ప్రముఖులకు ఛాలెంజ్​ను విసిరారు.

'హరితహారంకు బాసటగా గ్రీన్​ ఛాలెంజ్'​

By

Published : Nov 9, 2019, 7:37 PM IST

ఆస్ట్రేలియా తెరాస అధ్యక్షులు కాసం నరేందర్ రెడ్డి.. ఎమ్మెల్యే కోరి కంటి చందర్​కు విసిరిన గ్రీన్ ఛాలెంజ్​ను స్వీకరించి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటారు.

'హరితహారంకు బాసటగా గ్రీన్​ ఛాలెంజ్'​

మాజీ ఎమ్మెల్యే శేఖర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, నారాయణ, సినీనటులు బిత్తిరి సత్తి, ఆర్కే నాయుడు.. వంటి మరో ఐదుగురు ప్రముఖులకు కోరుకంటి గ్రీన్ ఛాలెంజ్ ఇచ్చారు. పూర్తి పర్యావరణానికి మేలు చేసే విధంగా చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్​ కార్యక్రమం తెలంగాణ హరితహారంకు బాసటగా నిలిచిందన్నారు.

ప్రతి ఒక్కరు తమ ఇళ్లల్లోని పరిసరాల్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు.

ఇదీ చూడండి: ప్రగతి భవన్ ముట్టడికి జగ్గారెడ్డి యత్నం... దారిలో అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details