తెలంగాణ

telangana

ETV Bharat / state

Harish Rao Fire On Central: కేంద్రం నిరుద్యోగ యువతను మోసం చేస్తోంది: హరీశ్ రావు - మంథనిలో మంత్రి హరీశ్ రావు

Harish Rao Fire On Central: దేశం కోసం రక్షణలో భాగం కావాలనుకుంటున్న యువత ఆశలపై భాజపా ప్రభుత్వం నీళ్లు చల్లుతోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. అగ్నిపథ్ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగలను బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో పర్యటించి మంత్రి రూ.7 కోట్లతో నిర్మించిన మాతాశిశు కేంద్రాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ప్రారంభించారు.

Harish Rao Fire On Central
రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు

By

Published : Jun 21, 2022, 10:13 PM IST

Updated : Jun 21, 2022, 10:30 PM IST

Harish Rao Fire On Central: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉన్నట్లు కేంద్రప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశంలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న మూడు రాష్ట్రాలు భాజయేతర రాష్ట్రాలే అని స్పష్టం చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్న భాజపా అధికారంలో ఉన్న ఉత్తర్​ప్రదేశ్ వైద్యసేవల్లో చిట్టచివరిగా 28 స్థానంలో నిలిచిందని హరీష్‌రావు ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో పర్యటించి మంత్రి రూ.7 కోట్లతో నిర్మించిన మాతాశిశు కేంద్రాన్ని సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ప్రారంభించారు.

రాష్ట్రం ఏర్పడక ముందు ఆరు ఐసీయూ కేంద్రాలు ఉంటే ఇప్పుడు రెండు వందలు ఏర్పాటు చేశామన్నారు. గడిచిన 70 ఏళ్లలో 3 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే రాష్ట్రం వచ్చాక 33 ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క మెడికల్ కాలేజీ తీసుకు రాలేకపోయారని..ఈ ప్రభుత్వం నాలుగు మెడికల్ కాలేజీని తీసుకొచ్చిందని హరీష్‌రావు వివరించారు.

కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా.. అగ్నిపథ్‌ అనే కొత్త పథకం తీసుకొచ్చారని దుయ్యబట్టారు. యువకులు దేశం కోసం పోరాడుతామంటే నాలుగేళ్లు ఉద్యోగం చేసి ఇళ్లకు పోయి ఏం చేయాలని ప్రశ్నించారు. నాలుగేళ్లలో ఒక సంవత్సరం శిక్షణలో పోతుందని.. మూడేళ్లు ఉద్యోగం చేసి ఇంట్లో కూర్చుంటే అతనికి పిల్లను ఎవరిస్తారని ఎద్దేవా చేశారు. పింఛన్లు, బెనిఫిట్స్ అడిగిన వాళ్లపై కేసులు పెడతామని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని అన్నారు.

కేంద్రం నిరుద్యోగ యువతను మోసం చేస్తోంది: హరీశ్ రావు

ప్రజల తలసరి ఆదాయం పెరిగింది. తెలంగాణ సాధించుకున్నాకే అభివృద్ధి జరిగింది. కాళేశ్వరంతో రాష్ట్రం పచ్చగా మారింది. రాష్ట్రం ఏర్పడ్డాక రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం. కేంద్రం ఉద్యోగాలివ్వకుండా నిరుద్యోగులను మోసం చేస్తోంది. ఇప్పుడేమో అగ్నిపథ్ తీసుకొచ్చింది. నాలుగేళ్లకు ఎవరైనా నౌకరీలు ఇస్తారా? తర్వాత పరిస్థితి ఏంటీ? ఇవాళ యువతను మోసం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా యువత రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. యువతను మీరు రెచ్చగొడుతున్నరు. భాజపా నాయకులు ఏం సమాధానం చెబుతారు. మీరు చేసిన ఒక్క మంచి పనైనా ఉంటే చెప్పండి.

- హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి

పుండుమీద కారం చల్లినట్లు నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగానికి వస్తావా.. చస్తావా అన్నచందంగా భాజపా నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అగ్నిపథ్‌ ఆందోళనలు ఇక్కడ కేసీఆర్​ చేయిస్తే.. ఉత్తర్​ప్రదేశ్​లో పోలీస్ స్టేషన్​ను యోగి కాల్చారా అని ప్రశ్నించారు. బిహార్, పంజాబ్‌, హర్యానా దేశమంతా ఆందోళనలు చేస్తున్నారంటే మీరు అగ్నిపథ్‌ అంశం తీసుకు రాకపోతే యువకులు రోడ్డుపైకి వచ్చేవారా అని ప్రశ్నించారు

ఇవీ చదవండి:

జూబ్లీహిల్స్‌ ఘటన నిందితులకు బెయిల్‌ పిటిషన్‌పై రేపు వాదనలు

ఎన్​డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము

Last Updated : Jun 21, 2022, 10:30 PM IST

ABOUT THE AUTHOR

...view details