తెలంగాణ

telangana

ETV Bharat / state

మంథనిలో హరీశ్​ జన్మదిన వేడుకలు - సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్​రావు

మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు జన్మదిన వేడుకలు పెద్దపల్లి జిల్లా మంథనిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.

హరీశ్​రావు జన్మదిన వేడుకలు

By

Published : Jun 3, 2019, 12:16 PM IST

Updated : Jun 3, 2019, 12:33 PM IST

పెద్దపెల్లి జిల్లా మంథని పట్టణంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్​రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. హరీశ్​ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్థన్ ఆధ్వర్యంలో మంథని చౌరస్తాలో కేక్ కట్ చేశారు. ప్రభుత్వ వైద్యశాలలో రోగులు, బాలింతలు, వృద్ధులకు, పాలు, పండ్లు, బ్రెడ్, బిస్కెట్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడల్లో హరీశ్​రావు నడుస్తూ తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతున్నారని కొనియాడారు. ఆయన సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని వేడుకలు జరుపుకున్నామని హర్షవర్ధన్ తెలిపారు.

హరీశ్​ జన్మదిన వేడుకలు
Last Updated : Jun 3, 2019, 12:33 PM IST

ABOUT THE AUTHOR

...view details