తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరాడంబరంగా హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు - Telangana news

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలను పెద్దపల్లి జిల్లా మంథనిలో నిరాడంబరంగా నిర్వహించారు. కొవిడ్ నేపథ్యంలో భక్తులకు అనుమతి ఇవ్వలేదు. కరోనా మహమ్మారిని నాశనం చేయాలని అర్చకులు పూజలు నిర్వహించారు.    

Hanuman Jayanti celebrations in Manthani town of Peddapalli district
Hanuman Jayanti celebrations in Manthani town of Peddapalli district

By

Published : Jun 4, 2021, 12:50 PM IST

పెద్దపల్లి జిల్లా మంథనిలో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించారు. పట్టణంలోని 11 హనుమాన్ దేవాలయాలను హనుమాన్ జయంతి సందర్భంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు. తమ్మి చెరువు ఒడ్డున వెలసిన ప్రాచీనమైన శక్తి హనుమాన్ దేవాలయంలో ఉదయాన్నే అభిషేకాలు నిర్వహించారు.

అనంతరం స్వామివారికి సింధూరంతో లేపనం నిర్వహించి, వెండి కవచంతో అలంకరించారు. హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా ప్రత్యేకంగా 108 తామర కమలాలతో, తులసీదళాలతో రకరకాల పుష్పాలతో స్వామివారికి అర్చనలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో భక్తులను దేవాలయంలోకి అనుమతి ఇవ్వలేదు.

కరోనా మహమ్మారిని తొలగించి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అర్చకులు పూజలు నిర్వహించారు. అర్చకులకు భక్తులు దేవాలయాలకు రాకపోవడం వల్ల హారతిలో హుండీలలో కానుకలు లేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ఇదీ చూడండి: Animal Lover : లాక్​డౌన్​లో శునకాల ఆకలి తీరుస్తున్న దుర్గారావు

ABOUT THE AUTHOR

...view details