పెద్దపల్లి జిల్లా మంథనిలో హనుమాన్ జయంతిని సామాన్యంగా నిరాడంబరంగా జరుపుకున్నారు. లాక్డౌన్ వల్ల భక్తులు లేక దేవాలయాలు వెలవెలబోతున్నాయి. పండుగల సందర్భంలో దేవాలయాల్లో నిర్వహించే ఉత్సవాలు సైతం లాక్డౌన్ కారణంగా నిర్వహించలేకపోతున్నారు.
నిరాడంబరంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు
హనుమాన్ జయంతి వేడుకలు.. లాక్డౌన్ కారణంగా నిరాడంబరంగా జరుగుతున్నాయి. అర్చకులు పూజలు చేసి... అధికారుల సూచనల మేరకు వెంటనే తాళాలు వేసేస్తున్నారు.
నిరాడంబరంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు
అర్చకులు ఉదయాన్నే దేవాలయాన్ని శుభ్రం చేసి... అభిషేకాలు, పూజలు, ధూప దీప నైవేద్యాలు నివేదించి, మంగళ హారతులు సమర్పించారు. అధికారుల ఆదేశానుసారం వెనువెంటనే గుడికి తాళాలు వేసేస్తున్నారు.
ఇవీ చూడండి:రేపటి నుంచే లాక్డౌన్ 4.0- ఆంక్షలపై సర్వత్రా ఉత్కంఠ