పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని పురాతనమైన శ్రీ శక్తి హనుమాన్ దేవాలయంలో హనుమాన్ జయంతి పూజలు వేడుకగా నిర్వహించారు. భక్తులు ఉదయాన్నే దేవాలయానికి విచ్చేసి మొదటగా గణపతికి, శివునికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆంజనేయస్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. పట్టువస్త్రాలతో, వర్ణమయ పుష్పాలతో అలంకరించి, ధూపదీప నైవేధ్యాలు నివేదించి మంగళహారతులు సమర్పించారు. దేవాలయానికి వచ్చిన భక్తుల శ్రీరామ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
మంథనిలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు - jayanthi
మంథనిలోని శ్రీశక్తి హనుమాన్ దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే భారీగా భక్తులు తరలివచ్చి ధూపదీప నైవేధ్యాలు సమర్పించి మెుక్కులు తీర్చుకున్నారు.
హనుమాన్ జయంతి వేడుకలు