గతేడాది కరోనా విలయం.. ఈ సంవత్సరంలో మూఢం.. ఫలితంగా శ్రమనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న వివిధ రంగాల ప్రజలు ఆర్థికంగా నానా అవస్థలు పడుతున్నారు. కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ వల్ల అనేక రంగాలు కుదేలయ్యాయి. పెద్ద, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధితో జీవనం సాగించేవారు, దినసరి కూలీల జీవితాలు దుర్భరమయ్యాయి. ఆ దెబ్బ నుంచి తేరుకొనేలోపే.. మౌఢ్యం వచ్చి పడింది. ఫలితంగా నిర్మాణ రంగం, వివాహాల, వేడుకలు వంటి శుభముహూర్తాలు దొరకని పరిస్థితి నెలకొంది. పెద్దపల్లి జిల్లా మంథనిలో ఆయా రంగాలపై ఆధారపడినవారి ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. వేదపండితులు, వస్త్ర వ్యాపారులు, ఫంక్షన్ హాల్, సౌండ్ సిస్టం నిర్వహకులు, మంగళ వాద్య కళాకారుల ఉపాధి ప్రశ్నార్ధకంగా మారింది.
అసలు ఏంటీ మౌఢ్యం..
సూర్యునికి దగ్గరగా గురు, శుక్ర గ్రహాలు రావడం.. ఫలితంగా వాటి బలం తగ్గుతుందంటున్నారు.. వేద పండితులు. ఇలా గ్రహాల బలం తగ్గడాన్నే మౌఢ్యం అంటారని పేర్కొన్నారు. ఇలాంటి సమయం శుభకార్యాలకు పనికిరావని పండితులు పేర్కొంటున్నారు. జనవరి 8న చివరగా అనేక వివాహాలు, గృహప్రవేశాలు, శుభకార్యాలు జరిగాయని.. మళ్లీ మే 14 వరకు ఎటువంటి ముహూర్తాలు లేవన్నారు. ఉగాది, వసంత పంచమి, రథసప్తమి వంటి పర్వదినాలు మధ్యలో వచ్చినా.. అవేవి బలమైన ముహూర్తాలు కావని పండితులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో హోమాలు, అభిషేకాలు, శ్రీమంతం, అన్నప్రాసన, నామకరణ వంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చునన్నారు.
పలువురు ఉపాధి ప్రశ్నార్ధకం..