పెద్దపెల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇద్దరు ఐపీఎస్ అధికారులు, రామగుండం కమిషనరేట్ సంబంధించి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. గుంజపడుగు బ్యాంక్ అధికారులను రామగుండం కమిషనరేట్ కార్యాలయానికి పిలిపించి వారి వేలి ముద్రలను తీసుకున్నారు.
ఎస్బీఐ చోరీ కేసులో దర్యాప్తు వేగవంతం - గుంజపడుగు వార్తలు
గుంజపడుగు ఎస్బీఐ చోరీ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. ఇద్దరు ఐపీఎస్ అధికారులు, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నారు. పలు ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.
ఎస్బీఐ బ్యాంక్ చోరీ, గుంజపడుగు చోరీ కేసు
దొంగతనానికి ఉపయోగించిన గ్యాస్ సిలిండర్ పైన నెంబర్‌ను దొంగలు చెరిపివేశారు. ఎక్కడా కూడా ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా పక్కా ప్లాన్ ప్రకారం దొంగతనం జరిగింది. చోరీ అనంతరం దొంగలు మహారాష్ట్ర వైపు వెళ్లారు అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుంజపడుగు నుంచి గోదావరిఖని, మంథని వరకు ఉన్న సీసీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని.. దొంగతనం జరిగిన సొమ్ముకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందని రీజినల్ మేనేజర్ ఆనంద్ తెలిపారు.