సెల్పీల కోసం అభిమానుల తాపత్రయం పెద్దపల్లి జిల్లాకి చెందిన యువకుడు... సింగరేణి ముద్దుబిడ్డ... బిగ్ బాస్ సీజన్-4 ఫేం సోహెల్‌కు సింగరేణి వాసులు ఘనస్వాగతం పలికారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీకి చెందిన సయ్యద్ సోహెల్ బిగ్ బాస్ షో-4 లో పాల్గొని... గెలుపొందాక మొదటి సారిగా సెంటినరీ కాలనీకి శనివారం వెళ్లారు.
సోహెల్‌తో సెల్ఫీలకు ఉత్సాహం రోడ్డుకు ఇరువైపులా ప్రజలు, యువకులు నిల్చొని పూలు వెదజల్లుతూ... కేరింతలు, చప్పట్లతో ఘనంగా ఆహ్వానించారు. సోహెల్‌తో సెల్ఫీలు తీసుకోవడానికి యువకులు పోటీ పడ్డారు. రాజకీయ నాయకులు తదితరులు సోహెల్‌ను సన్మానించారు.
సింగరేణి ముద్దుబిడ్డ సోహెల్‌కు ఘనస్వాగతం బిగ్ బాస్ షోలో జరిగిన సంఘటనల గురించి యువకులు అడిగిన ప్రశ్నలకు సోహెల్ వెంటనే సమాధానం ఇస్తూ... యువకులను ఉత్సాహపరిచారు. సెంటినరీ కాలనీలోని సింగరేణి జీఎం కార్యాలయానికి వెళ్లి జీఎం. సూర్యనారాయణ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. తనదైన ఆటతో జిల్లా ఖ్యాతిని చాటిచెప్పి, అత్యంత ప్రజాదారణ పొందిన మన సింగరేణి ముద్దుబిడ్డ సోహెల్ అంటూ జీఎం సూర్యనారాయణ అభినందించారు. సోహెల్‌ను, అతని తండ్రిని శాలువాతో సత్కరించారు.
ఇదీ చదవండి:ఫిబ్రవరిలో నయన్-విఘ్నేశ్ పెళ్లి!