తెలంగాణ

telangana

ETV Bharat / state

సుందిళ్ల మొదటి పంపు వెట్​రన్ ప్రారంభం - GOWLIWADA_

మేడిగడ్డ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన సుందిళ్ల పంప్‌హౌస్‌లో ఒకటో మోటార్‌ వెట్‌రన్​ను ఇవాళ అధికారులు ప్రారంభించారు. పంప్‌హౌస్‌ నుంచి గ్రావిటీ కాలువ ద్వారా ఎల్లంపల్లిలోకి నీటిని విడుదల చేశారు. పంప్‌హౌజ్‌ విజయవంతం కావటం వల్ల అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

సుందిళ్ల వెట్​రన్ ప్రారంభం

By

Published : Jul 31, 2019, 11:56 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టు సుందిళ్ల పంప్‌హౌస్‌లోని ఒకటో మోటార్‌ వెట్‌రన్‌ ప్రారంభమైంది. పంప్‌హౌస్‌ నుంచి గ్రావిటీ కాలువ ద్వారా ఎల్లంపల్లిలోకి అధికారులు నీటిని విడుదల చేశారు. 40 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఈ మోటర్... 2వేల 6వందల క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లి జలాశయంలోకి ఎత్తిపోస్తుంది. ఉదయం హెడ్రెగ్యులేటర్ ఛాంబర్ నుంచి ఫోర్ బే సంపులోకి 128 మీటర్ల నీటిని విడుదల చేసిన అధికారులు... మధ్యాహ్నం నుంచి పంప్‌హౌస్ వెట్‌రన్ ప్రక్రియను ప్రారంభించారు. రాష్ట్ర ఎత్తిపోతల పథకం సలహాదారులు పెంటారెడ్డి, ఈఎన్​సీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఇంజినీరింగ్ అధికారులు పనులు చేపట్టారు. మేడిగడ్డ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన గోలివాడ సుందిళ్ల పంప్‌హౌజ్‌ విజయవంతం కావటంతో అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

సుందిళ్ల వెట్​రన్ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details