ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నందిమేడారంలోని నందిపంపుహౌజ్ను సందర్శించారు. కాసులపల్లి నుంచి నేరుగా రోడ్డు మార్గాన వెళ్లి నందిమేడారంలోని ఆరో ప్యాకేజీని గవర్నర్ పరిశీలించారు. భూగర్భంలో నిర్మించిన పంపుహౌజ్ లోపలికి వెళ్లి పంపులను తిలకించారు. మోటార్ల పని తీరును వివరించే ఫోటో ప్రదర్శనను వీక్షించారు. గవర్నర్కు కలెక్టర్ దేవసేనతో పాటు కాళేశ్వరం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీధర్ మోటార్ల పని విధానాన్ని వివరించారు. నీటిని ఎత్తిపోసే డెలివరీ సిస్టర్న్‌లను పరిశీలించారు. మొత్తం మూడు మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నందిమేడారం నుంచి రోడ్డు మార్గాన హైదరాబాద్కు వెళ్లిపోయారు.
నంది పంపుహౌజ్ను సందర్శించిన గవర్నర్ తమిళిసై - GOVERNOR TAMILISAI KALESHWARAM VISIT
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంపుహౌజ్ను గవర్నర్ తమిళిసై సందర్శించారు. భూగర్భంలో నిర్మించిన మోటార్లను నేరుగా తిలకించి... పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
![నంది పంపుహౌజ్ను సందర్శించిన గవర్నర్ తమిళిసై GOVERNOR TAMILISAI VISIT NANDHI MEDARAM PUMP HOUSE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5342486-thumbnail-3x2-pppp.jpg)
GOVERNOR TAMILISAI VISIT NANDHI MEDARAM PUMP HOUSE
నంది పంపుహౌజ్ను సందర్శించిన గవర్నర్ తమిళిసై
ఇదీ చూడండి : సంక్షేమ బోర్డు.. సరకుల రవాణా.. బస్సుల తగ్గింపు!