తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ వైద్యాధికారి సేవా దృక్పథం - ప్రభుత్వ వైద్యాధికారి సేవా దృక్పథం

కరోనా వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా దాతల సహకారంతో అనేక చర్యలు చేపడుతున్నామని జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు అన్నారు.

zp chairmen distributed masks and sanitizers
ప్రభుత్వ వైద్యాధికారి సేవా దృక్పథం

By

Published : May 10, 2020, 4:30 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని సత్యసాయి నగర్​లో ప్రభుత్వ వైద్యాధికారి ఆగంతం నరేష్ ఆధ్వర్యంలో నాయి బ్రహ్మణులకు మాస్కులు, శానిటైజర్లు అందజేశారు జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు. అనంతరం మంథని చేపల మార్కెట్ ఏరియాలో మత్స్యశాఖ సహాయంతో నూతనంగా ఏర్పాటు చేసిన చేపల వంట తయారు కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్​తో పాటు మున్సిపల్ ఛైర్మన్ పుట్ట శైలజ ఉన్నారు. కరోనా సందర్భంగా ప్రతి ఒక్కరూ స్వీయరక్షణ పాటిస్తూ, అనేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. లాక్​డౌన్ పూర్తయ్యేవరకూ ప్రజలెవరూ ఇంట్లోంచి బయటకు రాకూడదని సూచించారు.

ఇవీ చూడండి:మాజీ మంత్రి రత్నాకర్​రావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

ABOUT THE AUTHOR

...view details