రామగుండం నగర మేయర్‌గా బంగి అనిల్ కుమార్ గెలిస్తే ఆయనెత్తు బంగారం పంచుతామని సమ్మక్క-సారలమ్మలకు 30వ డివిజన్లోని సీతానగర్ కాలనీ వాసులు మొక్కుకున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి ఈరోజు మొక్కును చెల్లించుకున్నారు.
మేయర్ కోసం.. నిలువెత్తు బంగారం
ఎన్నికల్లో గెలిస్తే.. ఫలానా పని చేస్తానని అభ్యర్థులు హామీలు ఇవ్వడం కామన్. కానీ.. రామగుండంలో మాత్రం.. తమ కాలనీ వాసి ఎన్నికల్లో గెలిస్తే.. ఆయనెత్తు బంగారం పంచుతామని మొక్కుకున్నారు కాలనీ వాసులు. అంతేకాదు.. సమ్మక్క సారలమ్మల జాతర సందర్భంగా తమ మొక్కు తీర్చుకున్నారు.
మొదటగా అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి, ఓవైపు బంగారం ముద్దులు, మరోవైపు మేయర్‌ని కూర్చోబెట్టి తూకం వేయించారు. అనంతరం బెల్లం పంపిణీ చేశారు. 30వ డివిజన్ ప్రజలకు తన వంతు సహకారం అందిస్తానని, నిరంతరం వారికి అందుబాటులో ఉంటానని మేయర్ అన్నారు. 'ఈ డివిజన్ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన నేను.. ఊపిరి ఉన్నంతవరకు కాలనీ వాసులకు అండగా ఉంటా' అని అనిల్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :మేడారం జాతరలో ఉచిత వైఫై..