పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కోల్బెల్ట్ వంతెన వద్ద నిర్వహించిన సమ్మక్క, సారలమ్మ జాతర ఆదాయం 45 లక్షల 78వేల 849 రూపాయలు సమకూరిందని ఆలయ ఈవో మారుతి తెలిపారు. ఈ మేరకు గోదావరిఖని సింగరేణి అతిథి గృహం సమీపంలోని సమ్మక్క, సారాలమ్మ ఆలయంలో జాతర హుండీ లెక్కింపు నిర్వహించారు.
గోదావరిఖని సమ్మక్క, సారాలమ్మ జాతర ఆదాయం 45 లక్షలు - sammakka and sarallamma jathara news
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సమ్మక్క, సారాలమ్మ జాతర హుండీలను లెక్కించారు. సుమారు 45 లక్షలకు పైనే ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో తెలిపారు.
ఈనెల 5 నుంచి 8 వరకు నిర్వహించిన జాతరలో భక్తులు హుండీలో వేసిన కానుకులు, నగదును సిబ్బంది లెక్కించారు. 36 హుండీలు లెక్కించగా... 25 లక్షల 78వేల 10 రూపాయాల ఆదాయం వచ్చింది. వీటితో పాటు 11 గ్రాముల బంగారం, కిలోన్నర వెండి ఆభరణాలు వచ్చాయి. టెండర్ల ద్వారా 13 లక్షల 51వేల 216 రూపాయలు, టికెట్ల ద్వారా 5 లక్షల 28వేల 850 రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. అలాగే 7 అమెరికా డాలర్లు కూడా కానుకగా వచ్చాయని ఆలయ ఈవో చెప్పారు. హుండీ లెక్కింపు రెండో పట్టణ సీఐ వెంకటేశ్వర్లు సమక్షంలో భారీ బందోబస్తు మధ్య లెక్కించినట్లు ఆలయ అధికారులు స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి :దిల్లీ తీర్పు: హస్తినను మరోసారి ఊడ్చేసిన ఆప్