పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. 45 ఏళ్ల లోపు ఉన్న 185 మంది డ్రైవర్లు, కండక్టర్లకు టీకాలు ఇస్తున్నట్లు డిపో మేనేజర్ తెలిపారు. 45 ఏళ్లు పైబడిన 300 మంది ఉద్యోగులకు గత నెలలోనే వ్యాక్సిన్ ఇప్పించామని స్పష్టం చేశారు.
Vaccine center: వ్యాక్సిన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్టీసీ డిపో మేనేజర్ - godavarikhani rtc depo manager venkateshwarlu latest news
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. అర్హులందరూ కరోనా టీకాను తీసుకోవాలని ఆయన సూచించారు.
వ్యాక్సిన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్టీసీ డిపో మేనేజర్
జనగామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు శ్రీవాని పర్యవేక్షణలో వ్యాక్సిన్ ఇస్తున్నట్లు డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని డిపోలో పనిచేసే ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ రవి కుమార్, ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :Eatala: ఒక్క ఎకరం ఎక్కువ ఉన్నా ముక్కు నేలకు రాస్తా: ఈటల సతీమణి