పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక శాసనసభ్యుడు కోరుకంటి చందర్ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పంట రుణాల మాఫీ, రైతుబంధు పథకానికి నిధులు మంజూరు చేసినందుకు గానూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం - Palabhishekam to CM KCR Image in Peddapalli district
ఆర్థిక ఇబ్బందులున్నా రైతులకు రుణమాఫీ, రైతు బంధుకు నిధులను విడుదల చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గోదావరిఖని క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపారని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రూ. 8,210 కోట్లు విడుదల చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, తదితరులు పాల్గొన్నారు.