కాళేశ్వరం ప్రాజెక్టులోని గాయత్రి పంప్ హౌస్ నుంచి గోదావరి నది జలాల ఎత్తిపోతలను పునఃప్రారంభించారు. ఐదో నంబరు బాహుబలి పంపు నుంచి 3,150 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు.
గాయత్రి పంప్ హౌస్ నుంచి మధ్య మానేరుకు జలాలు - గాయంత్రి పంప్‌హౌస్ వార్తలు
మధ్య మానేరుకు గోదావరి జలాలను తరలిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని గాయత్రి పంప్ హౌస్ నుంచి గోదావరి నది జలాలను వరద కాలువలోకి ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా మధ్య మానేరుకు తరలిస్తున్నారు.
గాయత్రి పంప్ హౌస్ నుంచి మధ్య మానేరుకు జలాలు
గాయత్రి పంప్ హౌస్ నుంచి గ్రావిటీ కాలువ ద్వారా ఎస్సారెస్పీ వరద కాలువలోకి.. అక్కడి నుంచి మధ్య మానేరు ప్రాజెక్టులోకి జలాలను తరలిస్తున్నారు. నీటి విడుదలతో సమీప గ్రామాల రైతులు, మత్స్యకారులను ఇంజనీరింగ్ అధికారులు అప్రమత్తం చేశారు.
ఇదీ చదవండి:ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు మేడారం చిన్న జాతర