GODAVARI RIVER IS POLLUTED: పెద్దపెల్లి జిల్లా మంథని పట్టణం తీరంలోని గోదావరి నది కలుషితమై నీటిపై నురగ తేలియాడుతుంది. శ్రావణమాసం సందర్భంగా పవిత్రమైన రోజులు కావడంతో వ్రతాలు చేసుకునే భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి తరలివస్తుంటారు. ఎన్నడూ లేని విధంగా రెండు రోజులుగా గోదావరిలో నురగ పేరుకుపోయి అంతా వ్యాపించడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైనుంచి వస్తున్న వ్యర్థజలాలతో నీరు కలుషితమవుతుందని వారు వాపోతున్నారు.
గతంలో ఎన్నడూ ఈ విధంగా చూడలేదని భక్తులు తెలిపారు. నదిపై భాగంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతం కావడం.. అక్కడ ఉన్నటువంటి కర్మాగారాల నుంచి కలుషితమైన నీరు గోదావరిలోకి రావడంతోనే కలుషితమవుతుందని చెప్పారు. నది తీరాన ఉన్న రైతులు కూడా ఈ కలుషిత నీటితో పంటలు సాగు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే సరైన చర్యలు తీసుకోవాలని.. గోదావరి కలుషితం కాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.