తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా సింగరేణి ఆవిర్భావ వేడుకలు

పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి సంస్థ 132వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జనరల్ మేనేజర్ పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా.. రామగుండం-1 ఏరియాలో ఉత్తమ అధికారులు, ఉద్యోగులను ఘనంగా సన్మానించారు.

By

Published : Dec 23, 2020, 10:50 PM IST

glorious-singareni-emergence-celebrations
ఘనంగా సింగరేణి ఆవిర్భావ వేడుకలు

సింగరేణి సంస్థ 132వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గోదావరిఖని సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. జీఎం కల్వల నారాయణ పాల్గొని సింగరేణి జెండా ఆవిష్కరించారు. జీఎంతో పాటు కార్మిక నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.

కొవిడ్ కారణంగా..

సంస్థ నిర్దేశించిన మేరకు బొగ్గు ఉత్పత్తి చేయలేకపోయామని జీఎం నారాయణ తెలిపారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే గనులలో కార్మికుల హాజరు శాతం పెరుగుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం సంస్థ ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటామని చెప్పారు.

కార్మికుల సంక్షేమం కోసం..

ఈ ఏడాది 682 మందికి కారుణ్య నియామక ఉత్తర్వులు అందించామని పేర్కొన్నారు. కార్మికులు వారి కుటుంబాల సంక్షేమం కోసం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గనులలో పూర్తి స్థాయిలో రక్షణతో కూడిన ఉత్పత్తి చేస్తున్నామని వివరించారు. అనంతరం రామగుండం-1 ఏరియాలో ఉత్తమ అధికారులు, ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు మిర్యాల రాజిరెడ్డి, గండ్రా దామోదర్ రావు, పెద్దపల్లి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కొత్తరకం కరోనా వైరస్‌తో బీ అలర్ట్​: ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details