పెద్దపల్లి జిల్లా మంథని మండల పరిధిలోని దుబ్బపల్లి గ్రామంలో గంగపుత్ర దివస్ ఉత్సవాలు ఘనంగా జరిపారు. అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం సందర్భంగా తమ కుల దైవం గంగమ్మ తల్లికి పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకున్నట్లు అఖిల భారత గంగపుత్ర మహాసభ జాతీయ అధ్యక్షుడు సత్యం బెస్త తెలిపారు.
గ్రామాలు సుభిక్షంగా ఉండాలి..
సకాలంలో వర్షాలు కురిసి గ్రామాలు సుభిక్షంగా ఉండాలని కుల దైవం గంగమ్మ తల్లిని కోరుకున్నట్లు తెలిపారు. పల్లెలు బాగుంటేనే దేశం అభివృద్ధిలో ఉంటుందన్నారు. చెరువులు, కుంటలు నిండి గంగపుత్రులకు చేపలు బాగా పెరగాలని.. రైతులు మూడు పంటలు పండించాలని ఆయన ఆకాంక్షించారు. తాము గంగమ్మ తల్లి బిడ్డలం, గంగపుత్రులం వందల ఏళ్లుగా నిజాం సర్కార్ కంటే ముందు నుంచే చేపలు పట్టే కులస్తులమని ఆయన గుర్తు చేశారు. అందుకే తమ కుల ఉనికి, అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు గంగపుత్ర దివస్ నిర్వహించామన్నారు.
కేసీఆర్ సర్కార్ తమ న్యాయమైన హక్కులను అమలు అయ్యేలా చొరవ తీసుకోవాలని సత్యం కోరారు.
1. వెంటనే మత్స్య సహకార సంఘాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలి.
2. ఒక్కో సహకార సొసైటీకి రూ. 10 లక్షల రివాల్వింగ్ ఫండ్ అందజేయాలి.