తెలంగాణ

telangana

ETV Bharat / state

నిందితులకు నకిలీ జామీను పత్రాలు జారీచేసే గ్యాంగ్​ గుట్టురట్టు - jameenu muta arrest

నకిలీ పత్రాలు సృష్టించి ఎవరికి పడితే వారికి జామీను పత్రాలు అమ్ముకుంటూ సొమ్ము చేసుకునే ఎనిమిది మంది సభ్యులు గల ముఠాను రామగుండం టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. ఇలా తప్పుడు పత్రాలు సృష్టిస్తూ వేలాది రూపాయలు సంపాదిస్తూ జల్సాలకు అలవాటు పడ్డారని రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు.

gang conspired to issue fake bail documents to the accused in peddapalli district
నిందితులకు నకిలీ జామీను పత్రాలు జారీచేసే గ్యాంగ్​ గుట్టురట్టు

By

Published : Aug 14, 2020, 6:07 PM IST

పరిచయం ఉన్నా లేకున్నా సరే కావాల్సిన డబ్బులు ఇస్తే చాలు.. క్షణాల్లో నకిలీ పత్రాలు సృష్టిస్తారు ఈ ముఠా సభ్యులు. ఎవరికైనా కోర్టు నుంచి బెయిలు దొరకాలంటే వారికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే జామీను ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ వాటికి విరుద్ధంగా ఎవరికీ ఎలాంటి సంబంధం లేకుండానే నకిలీ పత్రాలు సృష్టించి ఎవరికి పడితే వారికి జామీను పత్రాలు అమ్ముకుంటూ సొమ్ము చేసుకునే ముఠా సభ్యులను రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ అరెస్టు చేశారు.నకిలీ జామీను పత్రాలు సృష్టించే ఎనిమిది మంది ముఠా సభ్యులను రామగుండం టాస్క్​ఫోర్స్​ పోలీసులు కటకటాలకు పంపించారు. వారి వద్ద నుంచి నకిలీ జామీను పత్రాలు, రబ్బర్ స్టాంప్​లు, గ్రామపంచాయతీ రసీదులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఇల్లందు క్లబ్​లో నకిలీ జామీను పత్రాలు తయారు చేసే ముఠా సభ్యుల వివరాలను సీపీ సత్యనారాయణ వెల్లడించారు.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రెండో పట్టణ పరిధిలోని సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఏడుగురిని, అలాగే గోదావరిఖని విట్టల్ నగర్​కు చెందిన న్యాయవాదిని అరెస్టు చేశామన్నారు. గత 15 ఏళ్లుగా ముఠా సభ్యులు బోయిని కొమురయ్య, కిషన్ తాజ్, శేఖర్, శ్రీనివాస్, శివకుమార్, ఆదినారాయణ, అడ్వకేట్ మున్షి, మహేందర్ ముఠాగా ఏర్పడి సుమారు 200 పైగా కేసుల్లో నకిలీ పత్రాలను కోర్టుకు సమర్పించిన ట్లు తెలిపారు. ఇలా తప్పుడు పత్రాలు సమర్పిస్తూ వేలాది రూపాయలు సంపాదిస్తూ జల్సాలకు అలవాటు పడ్డారు. అడ్వకేట్ మున్షి సహకారంతో అక్రమాలకు పాల్పడుతున్న వీరిని అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. దీనికి సంబంధించి మరికొందరిపై విచారణ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నకిలీ జామీను పత్రాలు పట్టుకునేందుకు సహకరించిన గోదావరిఖని రెండో పట్టణ సీఐ శ్రీనివాసరావు, రామగుండం టాస్క్​ఫోర్స్​ సీఐ రాజ్ కుమార్​తో పాటు సిబ్బందిని రామగుండం సీపీ సత్యనారాయణ అభినందించారు.

ఇవీ చూడండి: కరోనా సోకిన కుటుంబానికి భాజపా జిల్లా అధ్యక్షుడు సాయం

ABOUT THE AUTHOR

...view details