తెలంగాణ

telangana

ETV Bharat / state

జర్నలిజంలో గాలిపల్లి శ్రీశైలానికి డాక్టరేట్​ పట్టా - gallipally srisailam phd degree

Gallipally Srisailam: టీయూ మాస్ కమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ రీసెర్చ్ స్టూడెంట్ గాలిపల్లి శ్రీశైలం పీహెచ్‌డీ పొందారు. 'సంక్షోభ నిర్వహణలో ప్రజా సంబంధాల పాత్ర- ప్రభుత్వ సంస్థలపై ఒక అధ్యయనం' అంశంపై పరిశోధన చేసినందుకుగాను డాక్టరేట్​ సాధించారు.

gallipally srisailam
gallipally srisailam

By

Published : Apr 23, 2022, 2:16 PM IST

Updated : Apr 24, 2022, 4:32 PM IST

Gallipally Srisailam: తెలంగాణ విశ్వవిద్యాలయం మాస్​ కమ్యూనికేషన్​ విభాగం పరిశోధక విద్యార్థి గాలిపల్లి శ్రీశైలం పీహెచ్​డీ పట్టా పొందారు. 'సంక్షోభ నిర్వహణలో ప్రజా సంబంధాల పాత్ర- ప్రభుత్వ సంస్థలపై ఒక అధ్యయనం' అంశంపై సిద్ధాంత గ్రంథం రూపొందించారు. శుక్రవారం నిర్వహించిన వైవాలో ఎక్స్​టర్నల్ ఎగ్జామినర్​గా విశ్రాంత ప్రొ.సుధీర్​కుమార్​, రిజిస్ట్రార్​ ప్రొ.శివశంకర్​, మాస్​ కమ్యూనికేషన్​ విభాగాధిపతి డాక్టర్​ చంద్ర శేఖర్, అసిస్టెంట్​ ప్రొఫెసర్​ డాక్టర్​ రాజారాం పాల్గొన్నారు.

ప్రొఫెసర్లతో శ్రీశైలం

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఏశాల తక్కలపల్లి గ్రామానికి చెందిన గాలిపల్లి దుర్గయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు శ్రీశైలం. ఇంటర్ వరకు జిల్లాలో విద్యాబ్యాసం పూర్తి చేశారు. డిగ్రీ హైదరాబాద్​లో చదివారు. జర్నలిజంపై ఆసక్తితో తెలంగాణ యూనివర్సిటీలో 2011లో పీజీ చేశారు. అనంతరం డెక్కన్ క్రానికల్​లో ట్రైనీ సబ్​ ఎడిటర్​గా పని చేశారు. తర్వాత పలు ప్రైవేట్​ సంస్థల్లో కార్పొరేట్​ రిలేషన్​ ఆఫీసర్​, పబ్లిక్​ రిలేషన్​ ఆఫీసర్​గా విధులు నిర్వర్తించారు.

పీహెచ్​డీ చేయాలనే లక్ష్యంతో తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులై సీటు సాధించారు. పరిశోధక విద్యార్థిగా పలు రిసెర్చ్ పేపర్లు రాశారు. దేశంలోని పలు విశ్వవిద్యాలయాల్లో నిర్వహించిన నేషనల్​ సెమినార్లలో పరిశోధన అంశాలపై పేపర్ ప్రజెంటేషన్​ చేశారు. పరిశోధక విద్యార్థిగా సామాజిక ఉద్యమాల్లోనూ పాల్గొన్నారు. 2015లో జాతీయ స్థాయిలో ఆర్జేఎన్​ఎఫ్​ ఫెల్లోషిప్​కు ఎంపికయ్యారు.

ప్రజెంటేషన్ ఇస్తున్న శ్రీశైలం

జర్నలిజంలో పీహెచ్​డీ పూర్తి చేసుకున్న శ్రీశైలంను వర్సిటీ ప్రొఫెసర్లు అభినందించారు. తమ కుమారుడికి డాక్టరేట్​ రావడం పల్ల తల్లిదండ్రులు గాలిపల్లి దుర్గయ్య, లక్ష్మి ఆనందం వ్యక్తం చేశారు. తనను గైడ్​ చేసిన మెంటర్​ డా.రాజారాంకు శ్రీశైలం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డాక్టరేట్​ రావడం ఆనందంగా ఉందని చెప్పారు. డా బీఆర్​ అంబేడ్కర్​ రాసిన రాజ్యాంగం వల్లే తాను పీహెచ్​డీ చేయగలిగాని తెలిపారు. అంబేడ్కర్​ స్ఫూర్తిగా ముందుకు వెళ్తానని పేర్కొన్నారు. విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొంటానని చెప్పారు. శ్రీశైలంకు డాక్టరేట్​ రావడం పట్ల ఆయన అక్క స్నేహ, అన్నయ్య వెంకటేశ్​, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి :

Last Updated : Apr 24, 2022, 4:32 PM IST

ABOUT THE AUTHOR

...view details