ఉద్యోగ సాధనలో నిరుద్యోగ యువతకు తమ వంతు సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని సింగరేణి అర్జీ -1 రామగుండం జీఎం కె.నారాయణ వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ క్రీడామైదానంలో యువకులకు ఎంపిక పోటీలు నిర్వహించారు. సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పరుగు పందెంను జీఎం జెండా ఊపి ప్రారంభించారు.
ఉచిత సైనిక శిక్షణను సద్వినియోగం చేసుకోండి : జీఎం - సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత ఆర్మీ శిక్షణ
సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలోని నిరుద్యోగ యువత ఉచిత సైనిక శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అర్జీ -1 రామగుండం జీఎం కె.నారాయణ తెలిపారు. సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ క్రీడా మైదానంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. ఈ శిక్షణ కోసం వంద మంది యువకులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు.
నిరుద్యోగ యువత ఉచిత సైనిక శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం యువకులకు ఎత్తు, బరువు, కంటి, రాత పరీక్షలు నిర్వహించారు. యువకులు ఆర్మీ ఎంపిక కోసం దాదాపు 100 మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ శిక్షణ పొందాలని యువతకు సూచించారు. నెల రోజుల పాటు నిర్వహించే ఉచిత శిక్షణలో భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు నారాయణ వెల్లడించారు. ఈ సందర్భంగా సైనిక శిక్షణ కోసం ఎంపికైన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, ఇతరులు పాల్గొన్నారు.