తెలంగాణ

telangana

ETV Bharat / state

సింగరేణి ఓబీలో బ్లాస్టింగ్.. నలుగురు కార్మికులు మృతి - రామగుండం తాజా వార్తలు

four-dead-in-singareni-opencast-in-ramagundam
సింగరేణిలో ఓబీ బ్లాస్టింగ్.. నలుగురు ఒప్పంద కార్మికులు మృతి

By

Published : Jun 2, 2020, 11:41 AM IST

Updated : Jun 2, 2020, 1:27 PM IST

11:39 June 02

సింగరేణి ఓబీలో బ్లాస్టింగ్.. నలుగురు కార్మికులు మృతి

సింగరేణి ఓబీలో బ్లాస్టింగ్.. నలుగురు కార్మికులు మృతి

పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఉపరితల గని-1లోని ఫేస్‌-2లో ప్రమాదం సంభవించింది. ఓబీ బ్లాస్టింగ్‌ చేసే సమయంలో.. మిస్‌ఫైర్‌ కావడం వల్ల ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు ఒప్పంద కార్మికులు మృతి చెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. 

ఈ దుర్ఘటనలో ప్రవీణ్‌, రాజేశ్‌, అర్జయ్య, రాకేశ్‌ మట్టిలో కూరుకుపోయి.. ఘటనా స్థలిలోనే మృతి చెందగా.. శంకర్‌, వెంకటేశ్‌, భీమయ్యలు తీవ్రంగా గాయపడ్డారు. 4 మృతదేహాలను సింగరేణి ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న సింగరేణి అధికారులు.. సహాయక చర్యలు చేపట్టారు.  

ఇదీచూడండి: అవతరణ వేడుకల్లో కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి

Last Updated : Jun 2, 2020, 1:27 PM IST

ABOUT THE AUTHOR

...view details