తెలంగాణ

telangana

ETV Bharat / state

'దేశం కోసం రాజీవ్​గాంధీ చేసిన సేవ ఎనలేనిది' - Rajiv Gandhi's vardhanthi

పెద్దపల్లి జిల్లా మంథనిలో.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నియోజక వర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

రాజీవ్​గాంధీ వర్ధంతి
rajeev gandhi vardhanthi

By

Published : May 21, 2021, 1:24 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని క్యాంపు​ కార్యాలయంలో.. మాజీ ప్రధాని రాజీవ్​గాంధీ వర్ధంతిని నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దేశ ప్రగతి కోసం మాజీ ప్రధాని చేసిన త్యాగాలు ఎనలేనివంటూ కొనియాడారు. అభివృద్ధి చెందుతోన్న దేశాల సరసన భారత్​ను నిలిపాడన్నారు. అనంతరం నియోజక వర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

విదేశాల్లో స్థిరపడ్డ తన మిత్రుడి సాయంతో.. నియోజక వర్గ ప్రజలకు క్యాంపు కార్యాలయంలో ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్​ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కరోనా కష్ట కాలంలో అవసరమున్నవారు.. డాక్టర్ సలహా నిమిత్తం వాడుకోవచ్చని తెలిపారు. కరోనా వారియర్స్​గా ముందుండి సేవలందిస్తోన్న వైద్య సిబ్బందికి మాస్కులు, శానిటైజర్​లు అందించారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియానూ.. ఫ్రంట్​లైన్​ వారియర్స్ జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇదీ చదవండి:కరోనా కరాళ నృత్యం.. పర్యవేక్షణపై ప్రజాప్రతినిధులు, అధికారుల అలసత్వం

ABOUT THE AUTHOR

...view details