పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో విదేశీయులు సందడి చేశారు. జర్మనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే కనగర్తికి చెందిన కార్తీక్‌తో, సెంటినరీ కాలనీకి చెందిన శృతితో ఈరోజు వివాహం జరిగింది.
తెలంగాణ పెళ్లిలో విదేశీయుల తీన్మార్ - kanagarth
తెలంగాణ పెళ్లిలో విదేశీయులు డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది.. అది కూడా మన భారతీయ వస్త్రాధారణలో.. అవును మీరు విన్నది నిజమే మన పాటలకు ఆడిపాడారు. జర్మనీ నుంచి వచ్చి ఇక్కడ కోలాటం వేసి అందరిని ఆకట్టుకున్నారు.
తెలంగాణ పెళ్లిలో విదేశీయుల డాన్స్
వివాహానికి వరుడు కార్తీక్ స్నేహితులు జర్మనీ నుంచి ఇక్కడకి వచ్చారు. జర్మనీ దేశీయులు భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పలు పాటలకు నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. విదేశీయులు దాండియా ఆడుతూ మైమరిపించారు.
ఇదీ చూడండి :చిలాటుగూడలో పులి జాడలు... భయాందోళనలో స్థానికులు