పెద్దపెల్లి జిల్లా అంతర్గాం మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎస్సారెస్పీ నీరు నుంచి భారీ వరద వస్తోంది. జలాశయం 15 గేట్లు ఎత్తి దిగువకు 1,43,865 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 19.4530 టీఎంసీలుగా ఉంది.
ఎల్లంపల్లి గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల - srsp latest news
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి 50 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేయడం వల్ల ఎల్లంపల్లికి భారీ వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఎల్లంపల్లి గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,52,235 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 1,44,513 క్యూసెక్కులుగా ఉంది. అలాగే తాగునీటి పథకాలకు కు 648 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. పై నుంచి నీరు వస్తుండటంతో మరిన్ని గేట్లు అవకాశం ఉంది.
ఇదీ చదవండి:వరద ప్రవాహం.. పార్వతి బ్యారేజ్ 58 గేట్లు ఎత్తివేత
Last Updated : Sep 16, 2020, 5:14 PM IST