తెలంగాణ

telangana

ETV Bharat / state

వరద ప్రవాహం.. పార్వతి బ్యారేజ్ 58 గేట్లు ఎత్తివేత - సిరిపురం వద్ద పార్వతి బ్యారేజ్

పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద పార్వతి బ్యారేజ్ 58 గేట్లు ఎత్తి అధికారులు గోదావరి నదిలోకి నీటిని వదిలారు. బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 8.83 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.479 టీఎంసీలుగా ఉంది.

Flood flow Parvati Barrage 58 gates lifted at siripuram peddapalli district
వరద ప్రవాహం.. పార్వతి బ్యారేజ్ 58 గేట్లు ఎత్తివేత

By

Published : Sep 16, 2020, 1:00 PM IST

వరద ప్రవాహం.. పార్వతి బ్యారేజ్ 58 గేట్లు ఎత్తివేత

పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద పార్వతి బ్యారేజ్ 58 గేట్లు ఎత్తి అధికారులు గోదావరి నదిలోకి నీటిని వదిలారు. గతవారం రోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండిపోవడం వల్ల నీటిని దిగువకు వదిలారు. ఈ నేపథ్యంలో పార్వతి బ్యారేజ్​లోకి నీరు చేరడం వల్ల బ్యారేజ్ 74 గేట్లలో 58 గేట్లను మూడు ఫీట్ల మేర ఎత్తారు.

బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 8.83 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.479 టీఎంసీలుగా ఉంది. బ్యారేజ్​లో పూర్తిస్థాయి నీటిమట్టం 130 మీటర్ల లెవెల్.. ప్రస్తుతం 129.15 మీటర్ల సామర్థ్యంగా నీటి నిల్వ ఉంది. బ్యారేజ్​ లోకి 1,44,890 క్యూసెక్కుల నీరు ఇన్​ఫ్లో వస్తుండగా, 1,44,890 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

ఇదీ చూడండి :మోదీ నిర్ణయాత్మక విధానాలు దేశానికే ఆదర్శం : కిషన్‌ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details