పెద్దపెల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ఉత్పత్తి 2600 మెగావాట్లు జరుగుతుండగా.. తాజాగా 800 మెగావాట్ల సామర్థ్యంతో మరో రెండు యూనిట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ కాలుష్యంతో పాటు భూసేకరణ ఇబ్బందులుగా మారడంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు యాజమాన్యం ఆలోచించి నీటిపై తేలియాడే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌పై దృష్టి సారించింది. అందులో భాగంగానే దేశంలోనే అతిపెద్దదైన 100మెగావాట్ల సామర్థ్యంతో రామగుండం ఎన్టీపీసీలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 450 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణ పనులను చేపట్టింది. లాక్డౌన్ కారణంగా ఈ పనుల్లో కొంత జాప్యం జరిగింది. 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని గ్రిడ్‌కు త్వరలోనే అనుసంధానం చేయనున్నారు. దశలవారీగా 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్నారు.
పనులు వేగంగా జరుగుతున్నాయి..