పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి బ్యారేజీలో గత 12 రోజులుగా నీటిని దిగువకు విడుదల చేస్తూ ఆదివారం గేట్లు మూసివేయగా.. గేట్ల దిగువ భాగాన ఉన్న మడుగులోకి మంచిర్యాల జిల్లా వైపు పెద్ద ఎత్తున చేపలు చేరాయి. ఆదివారం వాటిని పట్టుకోవడానికి తండోపతండాలుగా ప్రజలు వెళ్లారు.
పార్వతి బ్యారేజీ 25 గేట్లు తెరిచివేత .. నిరాశలో మత్స్యకారులు - పార్వతి బ్యారేజీ 25 గేట్లు తెరిచివేత .. నిరాశలో ప్రజలు
పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో పార్వతి బ్యారేజీ వద్ద చేపలు స్థానికులు పట్టుకోవడానికి తరలివెళ్తున్నారంటూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు వైరల్ కాగా అధికారులు ఉదయం 25 గేట్లు ఎత్తి.. నీటిని దిగువకు వదిలిపెట్టారు. దీంతో చేపల కోసం ఆశగా వచ్చినవారు నిరాశతో వెళ్లిపోయారు.
![పార్వతి బ్యారేజీ 25 గేట్లు తెరిచివేత .. నిరాశలో మత్స్యకారులు fishermen suffered as gates openeed for water flow in parvathi barrage](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8533366-1087-8533366-1598245002563.jpg)
పార్వతి బ్యారేజీ 25 గేట్లు తెరిచివేత .. నిరాశలో ప్రజలు
అయితే సోమవారం ఉదయం బ్యారేజీ 25 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలిపెట్టారు. ఫలితంగా చేపలు పట్టడానికి వచ్చిన వారికి నిరాశే మిగిలింది. ఆదివారం చేపలను తెచ్చుకున్నవారిలో చాలామందికి 10 నుంచి 25 కిలోల వరకు చేపలు దొరికినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ప్రభుత్వం చేపట్టిన చేపపిల్లల పెంపకం తమకెంతో ఉపయోగపడిందని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.