పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమీషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు అంతర్గం మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసరాల ప్రాంతాల్లోని చేపల చెరువులను అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. కోళ్ల వ్యర్థ పదార్థాలు వేసి చేపలను పెంచుతున్నారు అనే సమాచారంతో గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, అంతర్గాం ఎస్సై రామకృష్ణ, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులు చేపల చెరువులను పరిశీలించారు.
రామగుండంలోని చేపల చెరువులను తనిఖీ చేసిన అధికారులు - fish pond inspection
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసరాల్లోనూ చేపల చెరువులను అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. చెరువుల్లో కోళ్ల వ్యర్థాలు కలిపి చేపలను పెంచుతున్నారన్న సమాచారం మేరకు ఈ తనిఖీలను చేపట్టినట్టు గోదావరిఖని ఏసీపీ తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని ఈ ప్రాంతాల్లో చేపల పెంపకానికి ఎవరూ కోళ్ల వ్యర్థాలు ఉపయోగించడం లేదని వెల్లడించారు.
రామగుండంలోని చేపల చెరువులు ఆకస్మిక తనిఖీ
చెరువుల్లో కోళ్ల వ్యర్థ పదార్థాలు ఏమీ కనబడలేదని వారు వెల్లడించారు. చెరువుల్లో వ్యర్థాలు వేయరాదని అలా వేసి చేపలను పెంచితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ ఉమేందర్ హెచ్చరించారు. ఏపీలోని చెరువుల్లో వ్యర్థ పదార్థాలను కలుపుతున్న ఫోటోలు, వీడియోలు రామగుండం ప్రాంతం చెరువులలో కలుపుతున్నారని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మొద్దని.. ఇలాంటివి ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.
ఇదీ చదవండి:భూ ఆక్రమణలకు చైనా క్యాబేజీ వ్యూహం..!
TAGGED:
fish pond inspection