పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మొబైల్ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో... దుకాణంలో ఉన్న చరవాణులు, పరికరాలు దగ్ధమయ్యాయి. ఉదయం 9 గంటల సమయంలో ప్రమాదం సంభవించినట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే దుకాణ యజమానికి, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కానీ అప్పటికే భారీగా మంటలు చెలరేగడంతో దుకాణంలోని అన్ని వస్తువులు అగ్నికి ఆహుతైపోయాయి. రూ. 18 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు.
మొబైల్ దుకాణంలో అగ్నిప్రమాదం... 18 లక్షల మేర ఆస్తినష్టం
మొబైల్ దుకాణంలో అగ్నిప్రమాదం... 18 లక్షల మేర ఆస్తినష్టం
11:36 December 17
మొబైల్ దుకాణంలో అగ్నిప్రమాదం
Last Updated : Dec 17, 2020, 12:21 PM IST