పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మిత్రులతో కలిసి ఆనందంగా బర్త్డే వేడుకలు చేసుకుంటున్నాడు. కేక్ కట్ చేసే ముందు క్యాండిల్ వెలిగించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ సమయంలోనే స్నో స్ప్రే కొట్టడం వల్ల మంటలు చెలరేగాయి. పుట్టిన రోజు జరుపుకుంటున్న అబ్బాయి మొహానికి మంటలు అంటుకున్నాయి. వెంటనే మిత్రులంతా కలిసి మంటలను ఆర్పి వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
స్ప్రేతో మంటలు.. పుట్టినరోజు అపశ్రుతి - స్ప్రేతో మంటలు..పుట్టినరోజు అపశ్రుతి
స్నేహితుడి పుట్టినరోజుని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆనందంగా కేక్ కట్ చేసే సమయంలో కొట్టిన స్ప్రే వల్ల పుట్టిన రోజు జరుపుకుంటున్న అబ్బాయి మొహానికి మంటలు అంటుకున్నాయి.

స్ప్రేతో మంటలు.. పుట్టినరోజు అపశ్రుతి