పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం మధ్యాహ్నం రైతులంతా పనుల్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా అగ్ని మంటలు చెలరేగాయి.
ధాన్యం కొనుగోలు కేంద్రంలో అగ్నిప్రమాదం - Fire at the grain buying center in Periyapalli District
పెద్దపల్లి జిల్లా మడక గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 15 మంది రైతుల ధాన్యం కుప్పలు స్వల్పంగా కాలిపోయాయి.

ధాన్యం కొనుగోలు కేంద్రంలో అగ్నిప్రమాదం..
దీనితో పదిమంది రైతులు ధాన్యం కుప్పలు పూర్తిగా అగ్నికి అహుతి కాగా... 15 మంది రైతుల ధాన్యం కుప్పలు స్వల్పంగా కాలిపోయాయి. అప్రమత్తమైన రైతులు మంటలను కొంతమేర అదుపు చేశారు. అనంతరం సంబంధిత అధికారులకు విషయం తెలియజేసి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో 5లక్షలకు పైగానే ఆస్తినష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు.
ఇదీ చదవండి:మాస్క్‌తో మార్నింగ్ వాక్.. చాలా డేంజర్!
Last Updated : May 21, 2020, 5:10 PM IST