తెలంగాణ

telangana

ETV Bharat / state

మొక్కలు ధ్వంసమైనందుకు రూ.50 వేల జరిమానా - peddapally news

హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ధ్వంసం చేసింనందుకు గానూ... ఏకంగా రూ.50 వేల జరిమానా వసూలు చేశారు అటవీ శాఖ అధికారులు. ఈ ఘటన పెద్దపల్లి పాలకుర్తి మండలం అప్పనపేటలో జరిగింది.

మొక్కలు ధ్వంసమైనందుకు రూ.50 వేల జరిమానా
మొక్కలు ధ్వంసమైనందుకు రూ.50 వేల జరిమానా

By

Published : Aug 14, 2020, 5:46 AM IST

పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి మండలం అప్పనపేటలో హరితహారం మొక్కలు ధ్వంసం చేసిన ఇద్దరు వ్యక్తులపై అటవీ అభివృద్ధి సంస్థ అధికారులు చర్యలు తీసుకున్నారు. కేసు నమోదు చేసి రూ.50 వేల జరిమానా విధించారు. కట్నాపల్లి నుంచి గోదావరిఖని కోల్​బెల్ట్ వంతెన వరకు రాజీవ్ రహదారికి ఇరువైపులా అధికారులు మొక్కలు నాటారు.

ఇటీవల అప్పనపేట వద్ద రియల్ ఎస్టేట్ బిల్డర్లు అయిన స్వామి, రాజేశం... ట్రాక్టర్లు, టిప్పర్ లారీతో రోడ్డు పక్కన పెరిగిన మొక్కలను ధ్వంసం చేశారు. ఈ మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి, జరిమానా వసూలు చేశారు. హరితహారం మొక్కల ధ్వంసానికి ఎవ్వరు పాల్పడినా.... కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి డీఎఫ్​ఓ రవి ప్రసాద్ హెచ్చరించారు.

ఇవీ చూడండి:అమ్మలా ఆదుకుంటాయనుకున్న ఆశ్రమాలే... అత్యాచారాలకు నిలయాలుగా...

ABOUT THE AUTHOR

...view details