పత్తికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో రైతులు ఆందోళనకి దిగారు. మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న రాజీవ్ రహదారిపై బైఠాయించి దళారులు, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మద్దతు ధర కంటే తక్కువ కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటా పత్తికి కనీస మద్దతు ధర రూ.5,400పైగా ఉంటే నేడు రూ.3500 లోపే పలికినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
'దళారులు కుమ్మక్కు... అమాంతం పడిపోయిన పత్తి ధరలు'
పత్తికి మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. దళారులు కుమ్మక్కు అవడం వల్ల పత్తి రేటు అమాంతం పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ పెద్దపల్లిలో ఆందోళన చేపట్టారు.
'దళారులు కుమ్మక్కు... అమాంతం పడిపోయిన పత్తి ధరలు'
దళారులు కుమ్మక్కవడం వల్లే ధరలు అమాంతం పడిపోయాయని ఆరోపించారు. రైతుల ఆందోళనతో దాదాపు గంటపాటు ఇరువైపులా రాకపోకలు స్తంభించాయి. అనంతరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి మార్కెట్ అధికారులతో మాట్లాడతామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:నాన్న మరణించినా.. మరో ఇద్దరిని బతికించాడు!