పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గూడెం గ్రామంలో మొక్కజొన్న రైతులు కరోనా నిబంధనలు పాటిస్తూ రోడ్డెక్కి రాస్తారోకో చేపట్టారు. పంట కోసి నెల రోజులైనా.. రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు విషయంపై స్పష్టత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్డెక్కిన మొక్కజొన్న రైతులు
మొక్కజొన్న కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గూడెంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. వెంటనే ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు.
మొక్కజొన్న రైతులు
రైతు పండించిన పంటకు మద్దతు ధర విషయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కొనుగోలు చేయాలని కోరారు. ఖరీఫ్ సీజన్లో మొక్కజొన్నలను అమ్ముకున్న తర్వాత కొనుగోలుపై స్పష్టత ఇవ్వడం వల్ల నష్టపోయామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:'ఆక్సిజన్ రవాణాకు అంతరాయం రాకుండా చూడండి'