తెలంగాణ

telangana

ETV Bharat / state

'నష్ట పరిహారం చెల్లించి.. న్యాయం చేయండి' - Farmers organized by Rastaroko at the main square of Manthani

అన్నారం బ్యారేజ్​ బ్యాక్ వాటర్​లో భూములు కోల్పోయిన నిర్వాసితులు.. పెద్దపల్లి జిల్లా మంథని ప్రధాన చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

Farmers organized by Rastaroko at the main square of Manthani in Peddapalli district
'నష్ట పరిహారం చెల్లించి.. న్యాయం చేయండి'

By

Published : Jan 20, 2021, 5:42 PM IST

కాళేశ్వరం ప్రాజెక్ట్​లో భాగంగా.. అన్నారం బ్యారేజీ బ్యాక్​ వాటర్​లో పొలాలు, భూములు మునిగిన రైతులు మంథని ప్రధాన చౌరస్తాలో అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాలలు వేసి రాస్తారోకో నిర్వహించారు. నష్ట పరిహారం చెల్లించాలని మూడు సంవత్సరాలుగా.. అధికారులు, నాయకుల దృష్టికి తీసుకువెళ్లినా ఎవరు పట్టించుకోట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులను ఆదుకోండి..

ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పలుమార్లు తిరిగినా రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తూ కన్నీటిని తెప్పిస్తున్నారన్నారు. రహదారిపై సుమారు అర్ధగంట పాటు నిల్చోని రైతులను ఆదుకోండి అని నినాదాలు చేశారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం భూములకు ధర నిర్ణయించి బాధితులకు ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు రైతులందరూ ర్యాలీగా వెళ్లి మంథని ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించకుంటే ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:కేటీఆర్​ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి: తలసాని

ABOUT THE AUTHOR

...view details