రైతుల శ్రేయస్సు కొరకే ప్రభుత్వం నూతన వ్యవసాయ విధానాన్ని ప్రవేశ పెట్టిందని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. నియంత్రిత సాగుపై సుల్తానాబాద్ మండల కేంద్రంలో రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఒకే రకం పంట వేయడం వల్ల రైతులు నష్టపోతారని నియంత్రిత పద్ధతిలో సాగు చేస్తే.. వివిధ పంటలు పండించి అధిక లాభాలు పొందే అవకాశం ఉందని ఎమ్మెల్యే వెల్లడించారు.
పండించిన పంటకు.. లాభం ముఖ్యం
రైతులు పండించిన పంటకు అధిక లాభాలు చేకూర్చే విధంగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆహార ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు దిశగా కృషి చేస్తుందని మనోహర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న సాగు భూమిలో వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎంతో అధ్యయనం చేసి జిల్లా వారీగా పంట ప్రణాళిక అందించారని స్పష్టం చేశారు. ప్రతి ఐదు వేల ఎకరాల క్లస్టర్‌కు వ్యవసాయ విస్తరణ అధికారి అందుబాటులో ఉన్నారని.. వారి సేవలను వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యంగా వానాకాలంలో మొక్కల దిగుబడి ఎక్కువ వస్తుందని.. పత్తి, కందులు, పెసర్లు సాగు చేయాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ఆధునిక సేద్యం.. అధిక లాభం: మంత్రి ఇంద్రకరణ్