తెలంగాణ

telangana

ETV Bharat / state

చేపల కోసం చెరువులో నీటిని వదిలేస్తున్నారని రైతుల ఆవేదన

పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధి అయ్యగారి చెరువులో చేపలు పట్టుకునేందుకు నీటిని వదిలేస్తున్నారు. ఈ చెరువు ఆయకట్టు కింద సుమారు 50 ఎకరాల్లో వరి పంట సాగు జరుగుతుందని... నీళ్లు లేకపోతే పంట ఎండిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Telangana news
పెద్దపల్లిలో చెరువు

By

Published : May 20, 2021, 3:01 PM IST

యాసంగిలో పంటకు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని... చెరువులో ఉన్న నీటిని చేపలు పట్టుకునేందుకు వదిలేస్తున్నారని రైతులు వాపోతున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్​ పరిధి అయ్యగారి చెరువులో చేపల కోసం నీటిని వదిలిపెట్టేస్తున్నారని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ చెరువు నీళ్లతోనే చిన్న సన్నాకారు రైతులు... రెండు పంటలు సాగుచేస్తున్నారని... ఈ ఏడాది చెరువు నిండుగా ఉండడం వల్ల వర్షాకాల పంటకు ఏర్పాటు చేసుకుంటుండగా నీళ్లు వదిలేస్తున్నారని తెలిపారు. నిబంధనల ప్రకారం చెరువులో చేపలు పెంచిన వారు నీళ్లు తగ్గిపోయిన తర్వాత పట్టుకోవాలి కానీ ఇలా చేయడం తగదని పేర్కొన్నారు. అనేక సంవత్సరాలుగా ఈ చెరువులో చేపలు పెంచి పట్టుకోవడం ఆనవాయితీగా వస్తున్నా ఈసారి మాత్రం చెరువు ఖాళీ చేసే విషయం వివాదస్పందంగా మారింది. మరోవైపు నీటిని వదిలే అధికారం ఎవరికీ లేదని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:అధిక ధరలకు రెమ్​డెసివిర్ విక్రయం.. ముఠా అరెస్ట్​​..!

ABOUT THE AUTHOR

...view details